Crime News: మాదాపూర్ లో దారుణం.. ప్రియురాలు వేరొకరితో చనువుగా ఉందని తెలిసి హత్య..!

Crime News: ఈ రోజుల్లో చాలామంది యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు. అనేక మంది అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం సర్వస్వం ధారపోసి మోసపోతున్నారు. కొంతమంది ప్రేమ కోసం సన్ తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమంది ప్రేమించిన వారి చేతిలోనే దారుణంగా బలైపోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన మాదాపూర్ లో కలకలం రేపింది. తాను ప్రేమించిన వాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ప్రియురాలి మీద అనుమానంతో దారుణంగా హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే..లాలూ ప్రసాద్ అనే యువకుడు గత కొంత కాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఐతే సదరు యువతి నరేష్ అనే వేరొక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటూ అతనితో తిరుగుతోంది. ఇదంతా గమనించిన లాలూ ప్రసాద్ అనే యువకుడు తను ప్రేమించిన అమ్మాయి వేరొకరితో తిరగడంతో ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. ఆమె తనని కాదని వేరొకరితో తిరుగుతుండగా.. ఆమె మీద కోపంతో ఎలాగైనా తనని చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఆమెతో మాట్లాడాలని చెప్పి యువతిని హైటెక్ సిటీ ఔట్ పోస్ట్ దగ్గరికీ రమన్నాడు. యువతి వచ్చిన అనంతరం ఆమె మీద ఉన్న కోపంతో మొదట యువతిని అత్యాచారం చేసి తర్వాత హత్య చేశాడు.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.