ఇటీవల అనేకమంది ప్రతి చిన్న విషయాలకు కోపోద్రిక్తులు అవుతున్నారు. టెన్షన్లు, పని వత్తిడి, ఆహారపు అలవాట్ల వలన ఏ విషయాన్ని సున్నితంగా తీసుకోలేక తమని తాము చంపుకోవడం లేదా ఎదుటి వారిని చంపడమో చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఇలాంటి సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. తన రూమ్మేట్ అన్నం విసిరి కొట్టాడని కోపంతో అతడిని చంపేశాడు ఒక స్నేహితుడు.
వివరాల ప్రకారం….. ఫ్లోరిడాలో 22 సంవత్సరాల బ్రయాన్, మార్క్వేజ్ అనే యువకులు ఇద్దరు స్నేహితులు. ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు. అయితే ఒకరోజు అన్నం తింటుండగా ఏదో కోపంతో మార్క్వెజ్ తన అన్నాన్ని నేలకి విసిరి కొట్టాడు. దీంతో బ్రయాన్ కి స్నేహితుడిపై విపరీతమైన కోపం వచ్చింది. అలాగే స్నేహితుడి పై కోపం పెంచుకున్న బ్రయాన్ ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఫుల్లు గా మందు తాగేసి వచ్చి మార్క్వేజ్ పై దాడి చేశాడు.దీంతో మార్క్వెజ్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే అతను కింద పడగానే నోట్లోకి కంకర, ఇసక కుక్కి చంపేశాడు.
ఆ తరువాత అతని శవం ఎవరు చూడకుండా దాచాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తన ఇంటి పెరట్లో ఉన్న కాళీ స్థలంలో గుంత తవ్వి మార్క్వేజ్ మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే బ్రయాన్ హత్య గురించి స్తనికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బ్రయాన్ ని విచారించగా మొదట హత్యా నేరం అంగీకరించలేదు. ఆ తరువాత పోలిసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పోలీసుల సమక్షంలో గుంత తవ్వి శవాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి బ్రయాన్ ని అదుపులోకి తీసుకున్నారు.