విశాఖలో దారుణం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అక్కయపాలెం ఎన్జీవోస్ కాలనీలోని పద్మ భాస్కర అపార్ట్ మెంటులో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నార. విజయారెడ్డి భర్త బ్యాంక్ ఉద్యోగి. మంగళవారం ఉదయం విజయారెడ్డి బాత్రూంలో రక్తపు మడుగులోపడి చనిపోయి ఉన్నారు.
అపార్ట్ మెంటు కొనడానికి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సిసి టివి ఫుటేజి ఆధారంగా విచారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా నేత హత్యకు గురి కావడం కలకలం సృష్టిస్తోంది.