మరో బస్సు ప్రమాదం: బోల్తా కొట్టిన బస్సు,15 మంది…

కొండగట్టు బస్సు ప్రమాదం ప్రతి ఒక్కరిని కదిలించింది. 62 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందరిని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన మరువకముందే నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారం కింద ఉంది చదవండి.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాలెం సమీపంలో వింజమూరు రహదారిపై బస్సు బోల్తాపడింది. ఈ బస్సు ఆత్మకూరు డిపోకి చెందిందిగా తెలుస్తోంది. కావలి నుండి బయలుదేరిన బస్సు ఆత్మకూరు సమీపంలో ఉండగా…స్కూటర్ ను తప్పించబోయే ప్రయత్నం చేసాడు బస్ డ్రైవర్. అక్కడ మలుపు ఉండటంతో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్టు సమాచారం. అయితే ఈఘటనలో 15 మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం 108 లో ఆసుపత్రికి తరలించారు.

గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చేసుకున్నాయి. ప్రజా ప్రతినిధుల కార్లు కూడా పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి అందరిని కలచి వేసింది. ఆ తర్వాత దేశ ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా కొండగట్టు బస్సు యాక్సిడెంట్ నిలిచింది. 62 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరు గాయాలపాలయ్యి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇది మరువక ముందే నెల్లూరులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలతో ప్రజలు ఇళ్ల నుండి రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తి పోతున్నారు.