రూల్స్ బ్రేక్ చేసిన దీప్తి… బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం!

తెలుగు బిగ్ బాస్ 2 ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆడుతూ ముందుకు పోతున్నారు. టీవీ9 యాంకర్ దీప్తి మాత్రం చాలా విభిన్నంగా ఉంటూ – ఎలిమినేషన్ అనగానే విపరీతమైన ఒత్తిడికి గురి అవుతూ వస్తుంది. ఎలిమినేషన్స్ లో ఉంటే దీప్తి రెచ్చిపోయి మరీ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది.

పలు సార్లు కెప్టెన్సీకి ఛాన్స్ వచ్చినా కూడా టాస్క్లో ఓటమి పాలు అయ్యింది. 11 వారాల తర్వాత ఎట్టకేలకు దీప్తి కెప్టెన్ అయ్యింది. కెప్టెన్సీ దక్కడంతో ఈవారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్లే అని దీప్తి సంతోష పడుతున్న సమయంలో బిగ్ బాస్ షాకింగ్ గా ఆమెను కెప్టెన్సీ నుండి తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు. దీప్తి కెప్టెన్ గా ఉన్న సమయంలో గణేష్ పదే పదే నిద్ర పోవడంతో పాటు – పలు వురు మైక్ ధరించక పోవడం మరియు ఇతర రూల్స్ ను కూడా బ్రేక్ చేయడం వంటివి జరిగాయి. దీప్తి కూడా రూల్స్ ను బ్రేక్ చేసింది. దాంతో సీరియస్ అయిన బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కెప్టెన్సీ రావడం అది మూడు నాళ్ల ముచ్చటే అవ్వడంతో దీప్తి తీవ్రంగా నిరుత్సహంకు గురైంది. పదే పదే బిగ్ బాస్ ను ఆమె వేడుకుంది. తనకు మళ్లీ ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందిగా ఆమె బిగ్ బాస్ ను కోరుకుంది. దీప్తి తరుపున నాని కూడా బిగ్ బాస్ ను కెప్టెన్సీ మళ్లీ ఇవ్వాల్సిందిగా కోరాడట. మరి దీప్తి మళ్లీ కెప్టెన్సీ దక్కేనా చూడాలి. మరో వైపు ఇంటికి కెప్టెన్ లేకపోవడంతో ఆ కెప్టెన్సీని తనకు ఇవ్వాల్సిందిగా బిగ్ బాస్ ను కౌశల్ కోరడం కొసమెరుపు .