రోజు రోజుకి మహిళల పై అఘాయిత్యాలు తగ్గుతాయి అంటే పెరుగూనే ఉన్నాయి. దీనికి కారణం అసలు సరైన చట్టాలు లేకపోవడమేనా… ప్రభుత్వ నిర్లక్ష్యమేనా అందరి కొందరు భావిస్తున్నారు. ఏదైనా ఒక తప్పు జరిగితే దాన్ని ఖండిస్తూ కఠిన శిక్షలు ఉంటే ఈ విధంగా క్రైమ్ రేట్ పెరగదు కదా. అందులోనూ మహిళల పై చిన్న, పెద్దా అన్న వయసుతో నిమ్మిత్తం లేకుండా ఇలాంటి ఘటనలు రోజురోజుకూ ఎక్కువయ్యాయి. మొన్న ప్రియాంక, నిన్నమరో అమ్మాయి, రాత్రి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇలా రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు.
ఇక ఇదిలా ఉంటే ఓ పక్క ప్రియాంక ఇష్యూతో దేశమంతా అట్టుడికిపోతుంటే. తాజాగా కృష్ణా జిల్లాలో 53ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మొవ్వ మండలం కూచిపూడి యద్దనపూడి పంచాయతీ పరిధిలో నివసించే ఓ మహిళ(53) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఉండగా ఓ వ్యక్తి తనను కొట్టి అత్యాచారం చేసి పారిపోయాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేయగా.. చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన యద్దనపూడి గ్రామంలో కలకలం రేపింది. మహిళ ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న దుండగుడు పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక మరి వయసుతో సంబంధం లేకుండా మగవాళ్ళు మృగాళ్ళుగా మారి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కొందరి వాదనలు ఈ విధంగా ఉన్నాయి… టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినిమాల్లో పెడధోరణలు ఎక్కువైపోయాయి. బూతు కంటెంట్ వున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం మాటెలా వున్నా, సమాజంపై ఎంతోకొంత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే నీలి చిత్రాల తారల్ని తీసుకొచ్చి మరీ, మసాలా సినిమాల్ని తెరెకక్కిస్తున్నారు. ఏమన్నా అంటే, ‘సినిమాల్లో మంచీ చూపిస్తున్నాం.. దాన్నెవరూ ఎందుకు ఫాలో అవరు..?’ అని సినీ జనం అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. దీనికి సమాధానం చెప్పడం కష్టమేగానీ, మంచికన్నా చెడు వేగంగా యువత మెదళ్ళలోకి వెళ్తుందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఇక, ఇంటర్నెట్‌లో నీలి చిత్రాల హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.