ఏ ఇంట్లో అయినా సరే భర్యాభర్తలిద్దరూ కూడా బాధ్యతతో ఉంటేనే ఆ కుటుంబం బావుంటుంది. అలాగే భర్త అనేవాడు కష్టపడి భార్య బిడ్డలను చూసుకుంటేనే ఆ భార్య బిడ్డలు సంతోషంగా ఉండగలుగుతారు. ఇవేమి కాకుండా తాగుడు లాంటి వ్యసనాలకు అలవాటుపడి భార్య బిడ్డలను రోడ్డు మీద వదిలేస్తే ఆ ఆడది పడే బాధలు అంతా ఇంతా కాదు. అసలే ఆడవాళ్ళు ఎంతకని కష్టపడగలరు. అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు మేం దేనికీ తగ్గేది లేదన్నట్టు సంసారంలో సగ భాగం మోస్తూనే ఉన్నారు. ఆర్ధికంగా కూడా కుటుంబం కోసం కష్టపడుతూ ఎన్నో రకాలుగా తమ కుటుంబం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది తల్లి. ఇక ఆ తల్లికి కనీసం కడుపునిండా అన్నం కూడా పెట్టకపోతే తన బిడ్డలను వేసుకుని ఆ తాగుబోతు భర్తతో భరించలేక ఎన్నో కష్టాలుపడుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలోని కటక్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వీధుల్లో బొమ్మలు అమ్ముకుంటూ తన పిల్లలకు కడుపునింపుకుంటోంది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లలకు పట్టెడు అన్నం పెడుతుంది. దాగుడికి బానిసైన భర్త ఆమెను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ముగ్గురు చంటి బిడ్డలు అందరూ కూడా చాలా చిన్నవారు ముగ్గురూ ఐదేళ్ళలోపుల బిడ్డలే పైగా ముగ్గురూ ఆడపిల్లలే దాంతో అమె అన్నీ అయి కష్టపడి బిడ్డలను పోషించుకుంటుంది. ఇటీవలె ఆఖరి బిడ్డ అనారోగ్యంతో ఇబ్బందిపడుతుంది. ఆసుపత్రిలో చూపించడానికి డబ్బులు లేక నిర్లక్ష్యం చెయ్యడంతో సరైన వైద్యం దొరక్క ఆ బిడ్డ చనిపోయింది. దాంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆఖరికి ఆ బిడ్డకు అంత్యక్రియలు చెయ్యడానికి కూడా చేతిలో డబ్బులు లేక డబ్బు కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగలేక చనిపోయిన బిడ్డను తన ఒడిలోనే ఉంచుకుని ఓ పక్క కళ్ళనిండా నీళ్ళు… గుండెనిండా పెట్టుడు దుఃఖం దానితోనే ఆ బొమ్మలు అమ్మింది.
నగరంలోని బక్షిబజార్‌కు చెందిన భారతి, సుభాష్ నాయక్ వీరిద్దరు దంపతులు. సుభాష్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారతి బొమ్మలు అమ్ముతూ బిడ్డలను సాక్కుంటోంది. చిన్నకూతురు అనారోగ్య పాలవడంతో ఇటీవలె కన్నుమూసింది. అంత్యక్రియలకు డబ్బుల్లేక భారతి పాపను ఒడిలో ఉంచుకుని బొమ్మలు అమ్మిన వైనం అక్కడ చుట్టుప్రక్కలవారందరి మనసును కలచివేసింది. ఈ విషాదాన్ని చూడలేక కొందరు సాయం చేయడానికి ముందుకొచ్చారు. విషయం అధికారులకు తెలియడంతో భారతిని ఒప్పించి, పాప భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. మిగత ఇద్దరు పిల్లలను శిశుసంక్షేమ హాస్టల్లో పెట్టి వారి బాగోగులు కోసం మంచి జరుగుద్ది అని ఆమెకు ఎంతో నచ్చ జెప్పి ఒప్పించారు.