నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి. మూడవ సారైనా అమలు జరుగుతుందా?

ఏడేళ్ల క్రితం ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్య నిందితులకు మార్చి 3 వ తేదీన ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవంలో జనవరి 22 వతేదీ ఉరి శిక్ష అమలు చేయ వలసి వుండగా ఫిబ్రవరి 1 వతేదికి వాయిదా పడింది. జనవరి 31 వతేదీ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సుప్రీంకోర్టు హైకోర్టు లలో విచారణ అనంతరం సోమవారం పాటాయాలా కోర్టు మార్చి 3 వ తేదీ ఉరి శిక్ష అమలు చేయాలని తీర్పు చెప్పారు

అయితే నిందితుల లాయర్ నిందితుల్లో ఒకరు వినయ్ శర్మ జైలులో నిరాహార దీక్ష సాగిస్తున్నారని అతని మానసిక పరిస్థితి బాగా లేదని మరో నిందితుడు సుప్రీంకోర్టుకు క్యూరేటివ్ పిటిషన్ వేయవలసివుందని వాదించారు.

ఈ తీర్పు కూడా నిర్భయ తలిదండ్రులు వేసిన పిటిషన్ మేరకు పాటియాలా కోర్టు తీర్పు చెప్పింది