ప్రస్తుతం యువత ప్రేమ పెళ్ళిళ్లు అంటూ కొన్ని తప్పుదోవలు పట్టి ఆవేశానికి గురై నూరేళ్ళ జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకుంటున్నారు. వారు చేసే పనులకి ఇంట్లో పెద్దవారు తల్లిదండ్రులు ఏమైపోతారా అని కూడా ఆలోచించడం లేదు. తాము తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంత మంది బాధపడతారు. ఎన్నిజీవితాలు ముడిపడి ఉంటాయి. అని ఒక్క విషయం ఆలోచిస్తే యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇటీవలె అలాంటి సంఘటన ఒకటి పుదుచ్చేరిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…కాలేజ్ లో లవర్స్ పుదుచ్చేరి సమీపంలోని పుదువై కనకశెట్టి చెరువు ప్రాంతంలో గోతండం అనే రైతు నివాసం ఉంటున్నారు. గోతండం కుమారుడు సురేష్ (31) న్యాయవాది. కాలేజ్ లో చదువుకునే సమయంలో సురేష్, చత్తకళూరు ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. సురేష్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. మధ్యలో మరో యువతి కడలూరుకు చెందిన యువతి సురేష్ ను ఇష్టపడింది. పెద్దలు సురేష్ కు కడలూరు అమ్మాయికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. ప్రియురాలు దూరం అవుతుందనే అయోమయంలో సురేష్ ఉండేవాడు. ఆమెకు నచ్చజెప్పి తరువాత పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవడానికి సురేష్ అంగీకరించాడు. ఈ విషయం సురేష్ అతని ప్రియురాలికి చెప్పాడు.
నిశ్చితార్థం, పెళ్లి డేట్ ఫిక్స్ సురేష్, కడలూరు అమ్మాయికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. జనవరి 27వ తేదీన పెళ్లి చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. తరువాత కాబోయే భార్యను పిలుచుకుని పుదుచ్చేరి వెళ్లిన సురేష్ పెళ్లికి అవసరం అయిన నగలు, పెళ్లి బట్టలు తీసుకున్నారు. తరువాత సురేష్ కాబోయే భార్యతో వివిద ప్రాంతాల్లో తిరిగాడు. అనంతరం కాబోయే భార్యను కడలూరు బస్సు ఎక్కించి ఇంటికి పంపించాడు. ప్రియురాలికి పోన్ చేశాడు తన పెళ్ళికార్డును ఆమెకు ఇద్దామని. ప్రియురాలు కూడా కార్డు తీసుకోవడానికి తప్పకుండా వస్తానని అతనికి చెప్పింది. ఏం జరిగిందో ఏమోగాని ఆ అమ్మాయి ఫోన్ తియ్యలేదు. దీంతో సురేష్ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు ఎంత సేపటికి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో సురేష్ విసిగిపోయాడు. తరువాత నువ్వు ఎందుకు నాతో మాట్లాడటం లేదు, నీ అనుమతి తీపుకునే నేను వివాహం చేసుకుంటున్నాను కదా, నువ్వు మాట్లాడని ఈ జీవితం తనకు అనవసరం, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో కాల్ రికార్డు చేసిన సురేష్ దానిని ప్రియురాలు మొబైల్ కు పంపించాడు. ఆట పట్టిస్తున్నాడని ! సురేష్ తనను బెదిరించడానికి అలా చేస్తున్నాడని ఆ యువతి భావించింది.
అయితే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే ఆందోళన కూడా ఎందుకోగాని మరోపక్క మనసులో ఆవేదన చెందింది. వెంటనే ఆ యువతి సురేష్ ఇంటి దగ్గరకు వెళ్లింది. అప్పటికే సురేష్ ఇంటి లోపల గడియపెట్టుకున్నాడు. ఎంత సేపటికి సురేష్ తలుపులు తియ్యకపోవడంతో స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఫ్యాన్ కు సురేష్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. వెంటనే సురేష్ ను కిందకు దించి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాని సురేష్ మరణించాడని పోలీసులు తెలిపారు. ప్రియురాలు మాట్లాడలేదని సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.