పాములు అంటే భయపడని వారు ఎవరుంటారు అమ్మో పామా… అంటూ అది ఎటువంటి పాములైనా సరే అందరికీ భయమే. ఇక పొలాల్లో పని చేసే రైతులైతే పాపం వాళ్ల ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెట్టి మరీ రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించుకోవడం కోసం పాటుపడుతుంటారు. అయితే ఇటీవలె చెన్నపూర్ అనే గ్రామంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్ర పరిధిలో ఈ గ్రామం ఉంటుంది. అక్కడ ఓ రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లగా అతనికి పొలంలో రెండు తలల పాము కనబడింది. రైతు వెంటనే రేగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్ఐ కృష్ణ ప్రసాద్ పారెస్టు అధికారులకు సమాచారం అందించారు.
ఫారెస్ట్ ఆఫీసర్ ఫాయాజ్ తక్షణం ఆ ప్రదేశానికి వెళ్లి పామును పట్టుకున్నారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు. ఇది చాలా అరుదైన జాతికి చెందిన పాము అని ఫారెస్టు ఆఫీసర్ తెలిపారు. ఈ పాము అత్యంత అరుదైన ‘రెడ్ సాండ్ బో’ జాతికి చెందిన పాము అని స్థానికంగా దీనిని రెండు తలల పాముగా పిలుస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము ధర కొట్లలో ఉంటుందట. ఇది ఆరు నెలలు ముందుకు, ఆరు నెలలు వెనక్కు పాకుతుందని చెబుతున్నారు. పామును చంపకుండా తమకు సమాచారమిచ్చినందుకు ఫారెస్టు ఆఫీసర్ రైతును అభినందించారు.