చాలా మంది దెయ్యాలు, ఆత్మలు ఇలాంటి వాటిని అసలు నమ్మరు. మరికొంత మంది దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉంటుందని వేదాంతం మాట్లాడుతుంటారు. అయితే ఇంకొంత మంది దేవుడ్ని కూడా నమ్మరు ఇలా రక రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయితే ఆత్మలు దెయ్యాల పై రీసెర్చ్ చెయ్యడానికి కొందరు ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ దెయ్యాల గురించి నమ్మని వాళ్ళు కూడా నమ్మేటట్లు చేస్తుంది కొన్ని సంఘటనలు అవేంటంటే…. చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ క్రింద ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువ. అయితే ఈ రోడ్డు మార్గాల్లో ప్రమాదాల వెనుక కారణాలను అన్వేషిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు ఈ జాబితాలో ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో ప్రయాణించడం నివారించడం మంచిది. అసలు ఈ మార్గాలను ఎందుకు భయంకరమైనవిగా పరిగణిస్తారో తెలుసా?.
రాంచి – జంషెడ్ పూర్ ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోటు ఇదే. కొందరు ఇది దెయ్యం చేస్తుందని, అంటే మరికొందరు ఈ రహదారి శపించబడిందని చెబుతారు. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా రెండు దేవాలయాలు ఉంటాయి. వాహనాలను నడిపే వారు ఇక్కడ ఆగి ఈ రెండు ఆలయాలను దర్శించకుండా వెళితే ఈ రోడ్డు పైనే పెద్ద ప్రమాదానికి గురవుతారని చెబుతారు. కొందరు ఈ వాదనతో బలంగా ఏకీభవిస్తారు.
భంగర్ కోట మార్గం (ఢిల్లీ – జైపూర్ హైవే) లోని అత్యంత భయంకర ప్రదేశాల్లో రాజస్థాన్ భంగర్ కోట ఒకటి. దీని కారణంగానే ఢిల్లీ – జైపూర్ రహదారి శపించబడిందని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా జరగడం వెనుక కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా భంగర్ కోటను దాటే టప్పుడు ఏదో తెలియని భయం ఉంటుందని, ఆ భయం విపరీతమైన ఆందోళన కలిగిస్తుందని ఈ మార్గంలో ప్రయాణించే వారు చెపుతుంటారు.
సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, తమిళనాడులోని జాతీయ రహదారి మధ్య విస్తరించి ఉంది. ఇది చాలా నిశ్శబ్ధంగా, భయంకరంగా ఉంటుందని ప్రజలు చెబుతుంటారు. ఈ అడవుల్లోనే బందిపోటు వీరప్పన్ ను పోలీసులు మట్టుపెట్టారు. హైవేపై ఈ ప్రాంతం నుండి వెళుతున్నప్పుడు గాలిలో దీపాలు కనిపించడం, ఎవరో గట్టిగా ఆర్తనాదాలు చేయడం జరుగుతుందని చెబుతారు. దీంతో ఇటు వైపు రాత్రి సమయాల్లో ప్రయాణించడం కాస్త భయంకరంగా అనిపిస్తుంది.
కాషెడి ఘాట్ రోడ్డు తప్పక తెలుసుకోండి ఈ రోడ్డులో రక్తం మరిగిన పిశాచులు ఉంటాయని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లిన చాలా మంది ప్రయాణికులు అవి తమ ముఖంపై, మెడపై, వీపుపై భయంకరంగా గీరాయని చెబుతుంటారు. వారి శరీరంపై ఆ మచ్చలను కూడా చూపిస్తుంటారు. బాధితులు చెప్పిన కధనం ప్రకారం… వారు ఈ రోడ్డులో వెళ్తుండగా ఊహించని విధంగా వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయట. వారి వెంట తీసుకువెళ్తున్న మాంసాహార భోజనం గాలిలోనే అదృశ్యమైందట. అందుకే కాషెడి ఘాట్ రోడ్డులో వెళ్తున్నప్పుడు మాంసాహారాన్ని తీసుకువెళ్లవద్దని సూచిస్తారు.
ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు, న్యూ ఢిల్లీ ఇది కొందరికి గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డులో ప్రయాణించే వారు ఓ తెల్ల చీర కట్టుకున్న మహిళ వింత ఆకారం కనిపించినట్లు చెబుతారు. ఈ రోడ్డుకు సమీపంలో నివసించే వారు దీన్ని బలంగా చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఈ రోడ్డులో భయపడుతూ వాహానాలను నడుపుతుంటారు. ఈ ఆకారాన్ని చూసిన వారు వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోతున్నా అంతే వేగంతో ఆ మహిళ కూడా పరిగెత్తేదని చెబుతారు. నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది కదూ. కానీ ప్రత్యక్ష్యంగా వీక్షించిన వారి మాటల్లో కొంతైనా నిజం ఉండి ఉంటుందేమో. ఇక మరి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. అలా కాదని నమ్మకుండా ఉంటే ఇలాంటి ఎలాంటి పరిస్థితులకైనా దారి తీస్తాయి.