కేంద్రం సూపర్ స్కీమ్.. నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి రూ.30 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి 30,000 రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 30,000 రూపాయలు పొందే అవకాశం ఉండగా ఈ స్కీమ్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఒక పోటీలో పాల్గొనడం ద్వారా ఈ బెనిఫిట్ ను పొందవచ్చు.

తరచూ రీల్స్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఒకటిన్నర నిమిషాల నిడివితో ఉమాంగ్ యాప్ బెనిఫిట్స్ కు సంబంధించిన రీల్ చేసిన వాళ్లు డిసెంబర్ నెల 8వ తేదీలోపు రీల్స్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మొదటి స్థానంలో నిలిచిన వాళ్లకు 15000 రూపాయల ఫ్రైజ్ మనీ లభించనుండగా రెండో స్థానంలో నిలిచిన వాళ్లకు 12000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వాళ్లకు 10000 రూపాయల ఫ్రైజ్ మనీ లభించనుంది.

ఏడుగురికి మాత్రం కేవలం 2000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు లభించనున్నాయి. రీల్ కాంటెస్ట్ తో పాటు పోస్టర్ కాంటెస్ట్ పేరుతో మరో కాంటెస్ట్ అమలవుతుండగా ఇందులో తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 7500 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వాళ్లకు 5000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వాళ్లకు 1500 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు లభిస్తాయి.

ట్యాగ్‌లైన్ రైటింగ్ కాంటెస్ట్ అనే మరో పోటీ ఉండగా పోస్టర్ కాంటెస్ట్ కు ఏ విధంగా బహుమతులు అందుతాయో ఈ కాంటెస్ట్ కు కూడా అదే విధంగా బహుమతులు అందుతాయని తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ఏడు పదాల్లో ట్యాగ్ లైన్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ద్వారా సులభంగా బహుమతులను గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.