బంగారం ధర ఎంత తగ్గిందంటే…

బంగారం ధర

రూపాయి పడిపోవటం, ఇంటర్నేషనల్ గా నెలకొన్న పరిస్థితుల రీత్యా బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా దిగింది. మంగళవారం 220 రూపాయలు తగ్గడంతో 10 గ్రా.ల స్వచ్ఛమైన బంగారం 31,650 కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల వద్ద నుండి కొనుగోళ్లు తగ్గడం వలన కూడా బంగారం ధర తగ్గడంపై ప్రభావం చూపినట్లు తెలిపాయి బులియన్ మార్కెట్ వర్గాలు.

వెండి ధర

ఇక వెండి ధరకు వస్తే ఇది కూడా తగ్గింది. 50 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 39,250 రూపాయలకు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుండి కొనుగోళ్లు లేకపోవడం కారణంగా వెండి ధర తగ్గింది అంటున్నారు ట్రేడర్లు.

ఇంటర్నేషనల్ మార్కెట్

ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.39 శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి 2.39 శాతం తగ్గి ఔన్సు 14.38 డాలర్లు పలికింది.