ఉక్రెయిన్‌పై రష్యా దాడితో మార్కెట్లు గురువారం భారీగా పతనమైన విషయం తెలిసిందే. అమెరికా సహా ఐరోపా దేశాలు.. రష్యాను కొంతమేర నిలువరించే అవకాశం ఉందన్న సంకేతాలతో శుక్రవారం కొంత మేర పుంజుకున్నాయి. భారత్ స్టాక్ మార్కెట్లు కూడా సానుకూలంగానే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 700 కు పైగా పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభించగా.. ప్రస్తుతం 986 పాయింట్లతో .. నిఫ్టీ 290 పాయింట్లు వృద్ధి చెంది.. 16,538 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా రాణిస్తున్నాయి. అమెరికా సూచీలు గురువారం ఆరంభంలో భారీగా నష్టపోయినప్పటికీ చివరిలో కొంత పుంజుకొని భారీ నష్టాలతో కాకుండా పరిమితంగా ముగిశాయి . అదే బాటలో ఆసియా మార్కెట్లు కూడా పయనించాయి. శుక్రవారం మాత్రం కొంత సానుకూలంగా కదలాడుతున్నాయి
హమ్మయ్యా.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
