జియో క‌స్ట‌మ‌ర్ల‌కు షాక్‌… రీచార్జ్ చేయించారా ఇక అంతే…!

సంవ‌త్స‌రం చివ‌రిలో అంటే డిసెంబ‌ర్‌లో ఒక్క‌సారిగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, జియో టారిఫ్‌లు పెంచిన విష‌యం తెలిసిందే. ఒక వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ఆల్రెడీ పెర‌గ‌గా, తాజా జియో కూడా త‌న కొత్త ప్లాన్ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. ఇక ఈ సారి ప్లాన్‌లో భారీగా పెంచేసిన టారీఫ్‌. అద‌న‌పు లాభాల్లో అంటూ ప్ర‌చారం చేయ సాగింది. 40 శాతం వ‌ర‌కు పెంపు, 300 శాతం లాభాలు. తాజాగా అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన ప్లాన్లు….

ముందుగా జియో కొత్త ప్లాన్ రూ.129తో రీచార్జ్ చేసుకుంటే 2 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలను అందిస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండనుంది. దీనికి జియో ఎఫ‌ర‌డ‌బుల్ ప్లాన్ అని పేరు పెట్టింది. రెండోది రూ.199 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడం కోసం 1000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులుగానే ఉంది.

ఇక రూ.249 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుండ‌గా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ సౌకర్యం ఇందులో కూడా ఉంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే. రూ.349 ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 6 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ కు చేసుకోవడానికి 3000 నిమిషాలను అందిస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 84 రోజులుగా ఉంటుంది. దీన్ని కూడా జియో ఎఫ‌ర్‌డ‌బుల్ ప్లాన్ కింద రాబోతుంది.

రూ.399 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడం కోసం 2,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.ర జియో వెల్ల‌డించిన దీర్ఘ‌కాలిక ప్లాన్ల‌లో ఇదొక‌టి 1,299 ప్లాన్ ద్వారా మొత్తం 24 జీబీ డేటాను అందిస్తారు. మిగ‌తానెట్‌వ‌ర్క్ కాల్స్‌కు 12000 నిముషాలు అందిస్తారు.

ఇక ఈ రీచార్జ్ ల‌తో జియో టీవీ, జియో సినిమా, జియో సావ్న్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్ హబ్ వంటి ఇలా మ‌న‌కు కావ‌ల‌సిన జియో యాప్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో టీవీ ద్వారా 600కు పైగా చానెళ్లు కూడా చూడ‌వ‌చ్చు. ఈ జియోకి సంబంధించిన వార్త మొత్తం 150కు పైగా లైవ్ న్యూస్ చానెల్స్, 300కు పైగా న్యూస్ పేపర్ ఎడిషన్స్, 800కు పైగా మ్యాగజైన్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇక ఈ నెట్‌వ‌ర్స్ అన్నీ కూడా ముందు ఒక ప్లాన్ ఇచ్చి జ‌నాలు బాగా అల‌వాటు ప‌డ్డాక తిరిగి వారి ప్లాన్స్ మారుస్తూ కాస్త గంద‌ర‌గోళంలో ప‌డేస్తారు.