‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి
మొన్న శుక్రవారం రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ధియోటర్స్ లో ఘనంగా దిగింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొడతాడని నమ్మకంతో ఉన్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కావంటోతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరో ప్రక్క సాహో వేడి తగ్గింది, మిగతా సినిమాల ప్రభావం పెద్దగా లేదు. దాంతో బాక్సాఫీస్ రేసులో పెద్దగా పోటీ కూడా లేదు. అయితే ఈ సినిమాకు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది.
ఈ చిత్రం వీకెండ్ లలో బాగానే కలెక్ట్ చేసినప్పటికీ సోమవారం నుంచి డ్రాప్ స్టార్టైంది. మాస్ సెంటర్లలలో ఈ సినిమా బాగా వీక్ గా ఉండటం దెబ్బ కొట్టింది. మొదటి మూడు రోజుల్లో 12.87 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం నాలుగు రోజైన సోమవారం కేవలం 1.13 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయి…పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యి, లాభాల బాటలో పడతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఈ నాలుగు రోజులు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
ఏరియా షేర్ (కోట్లు)
——————– —————————————-
నైజాం 5.21
సీడెడ్ 1.62
నెల్లూరు 0.40
కృష్ణా 1.00
గుంటూరు 1.08
వైజాగ్ 1.72
ఈస్ట్ గోదావరి 1.13
వెస్ట్ గోదావరి 0.71
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 12.87