మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంలో కొన్ని సంఘటనలు తీసుకుని ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యిన దగ్గర నుంచి వివాదాలు మొదల్యాయి. యూ ట్యూబ్ లో ఆ ట్రైలర్ ని ఇటీవల తొలిగించారు. అయినా సరే మళ్లీ ట్రైలర్ ని పెట్టి… మూవీకి సంబంధించి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనుండగా, రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసి మూవీపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు. తెలుగు ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=HnTxGHGmUiU
రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం తెరకెక్కింది.
విజయ్ రత్నాకర్ గుత్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సలీమ్-సలైమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారని సమాచారం. ఆర్థికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా మారి 2004 నుంచి 2014 వరకు యూపీఏ పక్షాన ప్రధానిగా పనిచేసిన మన్‌మోహన్‌సింగ్ బయోపిక్ చిత్రం ప్రతి ఒక్కరిని తప్పక అలరిస్తుందని టీం చెబుతుంది. జనవరి 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.