రాజమౌళి కుమారుడు ‘కార్తికేయ’ పెళ్లి వీడియో

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జయపురలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ కూడా తన కుమార్తెలతో కలిసి వివాహానికి హాజరయ్యారు. అందరితో కలిసి ఆనందంగా సమయాన్ని గడిపారు.

ఈ నేపధ్యంలో కార్తికేయ, పూజ పెళ్లి పీటలపై తలంబ్రాలు పోసుకుంటున్న వీడియోను సుస్మిత తాజాగా సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. పెళ్లి చాలా అందంగా జరిగిందన్నారు. ‘తలంబ్రాల్లోని ఒక్కో ధాన్యం మీకు దీవెనలు, ప్రేమ, ఆనందం, ఆ దేవుడి ఆశీర్వాదాలు, సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నా. పూజ, కార్తికేయలకు శుభాకాంక్షలు. పెళ్లి ఎంత అందంగా జరిగిందో.. ఐ లవ్‌ యు గాయ్స్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

ఇక వివాహ తంతు తెలుగు స్టైల్‌లో జరిగినప్పటికీ.. మిగితా వేడుకలన్ని రాజస్తానీ స్టైల్‌లోనే జరిగినట్లు టాక్‌. కార్తికేయ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి.