లోదుస్తులతో సన్నీ లియోన్ సైడ్ బిజినెస్
ఒకప్పటి పోర్న్ స్టార్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ , బోల్డ్ క్యాకర్టర్స్ తో దుమ్మురేపుతున్న సన్నీ లియోన్ గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే ఆమె చేసే సైడ్ బిజినెస్. తన క్రేజ్ ని అడ్డం పెట్టుకుని లోదుస్తుల వ్యాపారం మొదలుపెట్టింది.
అవును..సన్నీలియోనీ..బిజినెస్ ఉమెన్ గా… సరికొత్త అవతారం ఎత్తింది. మహిళల లోదుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈమె.. ‘ఇన్‌ఫేమస్ బై స్టార్ట్ స్ట్రక్’ పేరుతో తన ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటోంది. ముంబయిలో జరిగిన ఇండియా లైసెన్సింగ్ ఎక్స్పో -2019లో తన నూతన బ్రాండ్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్రాండ్ లైసెన్సింగ్ వేదిక.
ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యాపారాన్ని మరింత పెంచకోడానికి బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది సన్నీ. ఫలితంగా 262 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థలో భాగమైంది.” ఇన్ఫేమస్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. రిటైల్ రంగంలో మా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు ఐఎల్ఈ వంటి ఓ ప్రతిష్టాత్మక వేదిక దొరికింది. ఇన్‌ఫేమస్ బ్రాండ్‌ను వయసుతో సంబంధం లేకుండా అందరి మహిళలు ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని చెప్పుకొచ్చింది సన్నీలియోన్