శ్రీదేవి చివరి సినిమా రిలీజ్ కు రెడీ

అతిలోక సుందరి శ్రీదేవిని మళ్లీ వెండితెరపై కనిపించనుందా అంటే అవును..ఆమెను చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. షారుఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జీరో’.అందులో ఆమె తన నిజ జీవిత పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఇందులో శ్రీదేవి ఎంట్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటోంది.

‘జీరో’లోని ఓ స్పెషల్ సాంగ్ లో పలువురు బాలీవుడ్‌ హీరోయిన్స్ కనిపించనున్నారు. ఆ పాటలోనే శ్రీదేవి మెరవనున్నారట. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ సన్నిహితులు ధ్రువీకరించారు. అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ఓ పార్టీ సీన్‌గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్‌లతో కలిసి శ్రీదేవి హల్‌చల్ చేస్తారని, ఈ సన్నివేశ చిత్రీకరణ ఇప్పటికే జరిగందని బాలీవుడ్ సమాచారందురదృష్టవశాత్తు ఇప్పుడు శ్రీదేవి మన మధ్యలో లేకపోయినా తెరపై చూసే అవకాశం కలగనుంది. ఇదే ఆమె ఆఖరి చిత్రం కానుంది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 21న విడుదల కానుంది.