“గాడ్ ఫాదర్” కి సల్మాన్ తీసుకున్న మొత్తాన్ని బయటపెట్టిన మెగాస్టార్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం గత ఆచార్య ఎఫెక్ట్ లేకుండానే భారీ అంచనాలు నెలకొల్పుకుని రిలీజ్ కి రాబోతుంది.

దీనితో మెగా ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంగానే ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించగా హిందీలో కూడా ఈ సినిమా రాణిస్తుంది అని అంతా అనుకుంటున్నారు.

మరి సల్మాన్ లాంటి నటుడు ఓ సినిమా చేస్తున్నాడు అంటే చిన్న రోల్ అయినా కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఉంటుంది. బిగ్ బాస్ షో చేస్తేనే ఒకో ఎపిసోడ్ కి సల్మాన్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. కానీ గాడ్ ఫాదర్ కి అయితే ఒక్క రూపాయి కూడా సల్మాన్ భాయ్ తీసుకోలేదని మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని అయితే రివీల్ చేశారు.

సల్మాన్ భాయ్ ఈ చిత్రం కేవలం మా మీద ప్రేమతో మాత్రమే చేసారని రెమ్యునరేషన్ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఏమన్నా తీసుకుంటాడో ఏమో కానీ ఇప్పుడు ఈ న్యూస్ ఆసక్తిగా మారింది.