“పుష్ప పార్ట్ 2” పై లేటెస్ట్ బిగ్ అప్డేట్స్ ఏమేమిటో మీకోసం.!

ఇండియన్ సెన్సేషన్ ఎస్ ఎస్ రాజమౌళి లేకుండా సొంతగా పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో అందులోని మన తెలుగు హీరో ఎవరు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. దర్శకుడు సుకుమార్ తో చేసిన హ్యాట్రిక్ సినిమా “పుష్ప” తన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ కాగా ఇప్పుడు దీనికి సీక్వెల్ పుష్ప పార్ట్ 2ని సిద్ధం చేస్తున్నాడు.

అయితే దీనిపై భారీ స్థాయి హైప్ హిందీ సహా ఓవర్సీస్ లో అంతకంతకు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా ప్రోగ్రెస్ పై లేటెస్ట్ బిగ్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. మరి వరుసగా చూసినట్టు అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ యంగ్ లుక్ తో పాటుగా ఒక 50 ఏళ్ళకి పైబడిన పుష్ప రాజ్ గా కూడా కనిపిస్తాడట.

అంతే కాకుండా తనకి ఒక కొడుకు పాత్ర కూడా ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే మరో అప్డేట్ ఏమిటంటే ఈ చిత్రానికి కొత్త నటీనటుల కోసం మేకర్స్ చూస్తుండగా హైదరాబాద్ లో ఈ ఆడిషన్స్ జరగనుండగా ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది.

దీని ప్రకారం అయితే ఫైనల్ గా ఈ చిత్రం షూటింగ్ ని సుకుమార్ ఎట్టకేలకు ఈ ఆగష్టు నుంచి స్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ చేశారట. ఇక్కడ నుంచి భారీ స్కేల్ లో షూటింగ్ ని జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ, సునీల్ అలాగే ఫహద్ ఫాసిల్ లు కీలక పాత్రల్లో కనిపిస్తారు.