జీవితంలో వాటి జోలికి వెళ్లను : జాన్వీ కపూర్

అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు తమిళ హిందీ కన్నడ వంటి అనేక భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన అలనాటి నటి శ్రీదేవి తనఅందం అభినయంతో అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని అతిలోకసుందరిగా గుర్తింపు పొందింది. కొంతకాలం క్రితం శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చింది. ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోలేకపోయింది.

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైంది. ఇతర భాషలలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ అమ్మడు ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం శ్రీదేవి బ్రతికి ఉంటే జాన్వీ కపూర్ పరిస్థితి వేరేలా ఉండేది. తన తల్లిలాగే జాన్వీ కపూర్ కూడా ఫాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొంది ఉండేది. అయితే గతంలో చాలా సందర్భాలలో శ్రీదేవి నటించిన సినిమాలలో జాన్వీ కపూర్ నటిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు జాన్వీ కపూర్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.

గతంలో శ్రీదేవి ఇటు సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా శ్రీదేవి కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి తన స్టామినా నిరూపించుకుంది. అయితే ఇలా శ్రీదేవి చేసిన సినిమాల్లో ఏదైనా ఓ సూపర్ హిట్ సినిమాని జాన్వీ రీమేక్ చేసే అవకాశాలున్నాయా.? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయంపై జాన్వీ స్పందిస్తూ తన తల్లి నటించిన సినిమాలని రీమేక్ చేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతోంది. ఇలా తన తల్లి నటించిన సినిమా రీమేక్ చేయకపోవటానికి భయం కాదు తన తల్లి మీద ఉన్న గౌరవం అని అంటోంది ఈ అమ్మడు.