శ్రీదేవి బయోపిక్‌… బోనీ కంగారు..అసలు సీక్రెట్ ఇదా?

ఫిబ్ర‌వ‌రి 24న బాత్ ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతి కోట్లాది అభిమానుల‌కి శోక‌సంద్రాన్ని మిగిల్చింది. కుటుంబ స‌భ్యులు ఆమె లేద‌నే వార్త‌ని ఇప్పటికీ ఏ మాత్రం జీర్ణించులేకపోతున్నారు.ఈ అతిలోక సుందరి జీవిత కథను వెండితెరకు తీసుకురావాలని అనేకమంది దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వాళ్లందరి కంటే శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కిండానికి తనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె భర్త బోనీ కపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం …మిగతా వాళ్లందరికన్నా ముందే శ్రీదేవి బయోపిక్‌ను తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు బోనీ. ఆమె గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆ చిత్రానికి న్యాయం జరుగుతుంది. శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా ఆయనే తీసుకోబోతున్నారు. అయితే ఈ బయోపిక్‌ దర్శకత్వ బాధ్యతలూ బోనీనే తీసుకుంటారా.. లేదా అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదట. అయితే బోనీ కపూర్ అర్జెంటుగా ఈ బయోపిక్ చేయాలనుకోవటానికి కారణం అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే..

మరో ప్రక్క శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. శ్రీదేవి బాత్‌రూమ్‌లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్‌కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు.

కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. వేరే వాళ్లు చేస్తే ఇవన్నీ ఆ బయోపిక్ లో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే బోనీ కపూర్ తొందర పడుతున్నట్లు సమాచారం.