మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితాధారంగా రూపొందిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ సినిమాను మొదలైన నాటి నుంచి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ఆ మధ్యన ట్రైలర్ విడుదలనప్పుడు గా అంతటా హాట్ టాపిక్గా మారింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అది మరింత ఎక్కువైంది .
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. తాము చూసిన మీదటే సినిమాను రిలీజ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయినా చిత్ర యూనిట్ ఇవేమీ పట్టించుకోకుండా శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దీనిని చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు చాలాచోట్ల నిరసన వ్యక్తం చేశారు.
ఇక కోల్‌కతాలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి తమ పార్టీ జెండాలతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చిత్రం ప్రదర్శితమవుతుండగానే తెరపైకి వస్తువులను విసరడంతో తెర చిరిగిపోయింది. మరోపక్క ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు. చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చిత్రంలో తమ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయగా, రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసి మూవీపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు.
https://www.youtube.com/watch?v=HnTxGHGmUiU
రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం తెరకెక్కింది.
విజయ్ రత్నాకర్ గుత్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సలీమ్-సలైమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో విడుదల చేసారు. ఆర్థికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా మారి 2004 నుంచి 2014 వరకు యూపీఏ పక్షాన ప్రధానిగా పనిచేసిన మన్‌మోహన్‌సింగ్ బయోపిక్ చిత్రం ప్రతి ఒక్కరిని తప్పక అలరిస్తుందని టీం చెబుతోంది.