బాలీవుడ్ ప్రముఖుల పై తాజాగా బీజేసీ నేత బిజీ నేత బైజయంత్ జే పాండా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని సంలచల వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్లో హింసను ప్రోత్సహించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నారని, బైజయంత్ ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదు బైజయంత్.
ఈ క్రమంలో దేశభక్తి కలిగిన బాలీవుడ్ ప్రముఖులు, అలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని బైజయంత్ హెచ్చరించారు. అలాగే విచారణలో భాగంగా కొంతమంది ఉత్తరాది నటులకు, పాకిస్తాన్ ఎన్నారైలతో సంబంధాలు ఉన్నట్టు తేలిందని, దీంతో పాక్ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన బాలీవుడ్ ప్రముఖుల పై సమగ్ర దర్యాప్తు చేయాలని, వారిని దేశం నుండి బహిష్కరించాలని బైజయంత్ అన్నారు.
ఇకపోతే ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వారి హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక ఇప్పటికే సుశాంత్‌సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో తాజాగా బైజయంత్ జే పాండా చేసిన సంచలన ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి ఆయన వ్యాఖ్యల పై బాలీవుడ్ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.