శ్రీ‌దేవి పర్శనల్ సీక్రెట్స్ ఆ పుస్తకంలో..ఏంటవి?

తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి శ్రీదేవి. ఆమె దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. దశాబ్ధాల పాటు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. శ్రీదేవికు ఏ స్దాయిలో అభిమానులు ఉన్నారో అప్పుడు ప్రపంచానికి పూర్తిగా అర్దమైంది.

అయితే ఇప్ప‌టికీ శ్రీ‌దేవి మ‌ర‌ణం ఓ మిస్ట‌రీ అనే అభిమానులు న‌మ్ముతున్నారు. ఆ విషయం ప్రక్కన పెడితే శ్రీ‌దేవి జీవితంలోని ప‌లు సీక్రెట్స్ ని రివీల్ చేసే ఓ పుస్త‌కం త్వ‌ర‌లో రిలీజవుతోంది. ఈ పుస్త‌కాన్ని సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు `అతిలోక సుంద‌రి శ్రీదేవి క‌థ‌` పేరుతో ర‌చించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ చేయబోతున్నారాయన.

ఈ పుస్త‌కంలో ఏ విష‌యాలు ఉంటాయి?

శ్రీ‌దేవికి సంబంధించి అనేక విషయాలను మాత్రమే కాక అతి కొద్ది మందికే తెలిసిన కొన్ని వ్యక్తిగత సీక్రెట్స్‌ని ఆయ‌న లీక్ చేస్తున్నార‌ట‌. బాల‌న‌టిగా సినీ ప్రపంచంలో ప్ర‌వేశించిన శ్రీ‌దేవికి కెరీర్ కు మొదటనుంచి చివరిదాకా ఏఏ ద‌ర్శ‌కులు బ్యాక్‌బోన్‌గా నిలిచారు? సినీహీరోల‌తో శ్రీ‌దేవి సాన్నిహిత్యం ఎలాంటిది?

బోనీ క‌పూర్‌ని పెళ్లాడ‌క ముందు శ్రీ‌దేవి జీవితంలోని సంఘ‌ర్ష‌ణ ఎలాంటిది? హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో ప్రేమ‌వ్య‌వ‌హారం.. అటుపై సీక్రెట్ పెళ్లి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీ‌దేవి సినిమా నిర్మించాల‌ని అనుకున్నారా? ఇలా ప్ర‌తిదీ ఈ పుస్త‌కంలో ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించేందుకు ఇప్ప‌టికే స్టార్ హీరోయిన్ స‌మంత‌ను సంప్ర‌దించారు. ఆమె అందుకు అంగీకారం తెలిపార‌ట‌. ఈ వారంలోనే పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలుస్తోంది. ప‌సుపులేటి ప‌బ్లికేష‌న్స్ పేరుతో జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ఈ పుస్త‌కాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు.

ఇంతకు ముందు ఆయ‌న ర‌చించిన‌ చిరంజీవితం 150, వెండితెర విషాద రాగాలు, అద్భుత న‌టి సావిత్రి వంటి పుస్త‌కాలు ఇప్ప‌టికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న `సంతోషం` సినీమ్యాగ‌జైన్‌లో జ‌ర్న‌లిస్టుగా కొన‌సాగుతున్నారు.