రౌడీ స్టార్‌కి అలా ఝ‌ల‌కిచ్చిన జాన్వీ

యంగ్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా `ఫైట‌ర్` సెట్స్ కెళుతున్న సంగ‌తి తెలిసిందే. పూరి- చార్మి బృందం ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి క‌థానాయిక స‌హా కాస్టింగ్ ని ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌రు? అన్న‌దానిపై ఇంత‌వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. జాన్వీకి క‌థ న‌చ్చింద‌ని సూచ‌న ప్రాయంగా అంగీక‌రించింద‌ని వార్త‌లొచ్చాయి. 

తాజా స‌మాచారం ప్ర‌కారం.. జాన్వీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రాల‌కు బ‌ల్క్ గా కాల్షీట్లు కేటాయించాల్సి రావ‌డంతో పూర్తిగా వెన‌క్కి త‌గ్గింద‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించేందుకు పూరి బృందం అన్నిటినీ సిద్ధం చేస్తున్న వేళ ఇది షాకింగ్ న్యూసే. ఇక ఈ చిత్రంలో రియ‌ల్ బాక్సింగ్ చాంపియ‌న్ మైక్ టైస‌న్ స‌హా సంజ‌య్ ద‌త్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. బాక్సింగ్ నేప‌థ్యంలోని ఈ చిత్రంలో విజ‌య్ పాత్ర ఎంతో ఇంటెన్స్ తో ఉంటుంద‌ని యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో పాన్ ఇండియా కేటిగిరీలో తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయ‌నున్నారు.