రామ్ చరణ్ మామూలోడు కాదు…ఎత్తుకు పై ఎత్తు

‘వార్’ఇన్ సైడ్ టాక్ తెలిసే ‘సైరా’ఆ స్కెచ్

మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’ . రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని తెలుగు, తమిళం,కన్నడం,మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తన ప్రమోషన్ టెన్నిక్స్ లో ఈ మూవీకి సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు పెంచేశాడు.

అయితే అదే రోజు హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ ‘ మూవీ రిలీజ్ అవుతోందంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వారం రోజుల పాటు ‘సైరా’ విడుదల వాయిదా వేయడం మంచిదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత చరణ్ ను కోరినట్టుగా తెలుస్తోంది. దాంతో రామ్ చరణ్ తన నెట్ వర్క్ తో అసలు ఈ సినిమాకు ఎంత సీన్ ఉంది..హిట్ అవుతుందా..ఏ స్దాయి హిట్ అనేవి ఎంక్వైరీ చేయించారట. దాంతో అసలు విషయం బయిటపడిందిట.

వార్ కు అంత సీన్ లేదని తెలిసింది. కేవలం ట్రైలర్ లో దుమ్ము దులిపారు కానీ సైరా కు పోటీ వచ్చేటంత కంటెంట్ లేదని, సినిమా నిలబడదని చెప్పారట. దాంతో ధైర్యంగా సైరాని అదే రోజు రిలీజ్ కు పెట్టారు. అయితే వార్ రిలీజ్ తో అక్కడ ‘సైరా’కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం లేదట. పైగా బాలీవుడ్ లో ఈ చిత్రం పోటీని తట్టుకొని కలెక్షన్లు రాబట్టాలంటే కష్టతరమవుతుంది అని హెచ్చరిస్తున్నారు. అయితే తమ సినిమా మీద ఉన్న నమ్మకం ధైర్యంతో రిలీజ్ డేట్ ని మార్చేది లేదని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారట.

సైరా రిలీజ్ రోజున హిందీలో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ హీరోలుగా చేస్తున్న ‘వార్’ మూవీ రిలీజ్ కాబోతున్నది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. గతంలో హృతిక్ రోషన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రిలీజై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 53 సెకన్ల నిడివి కలిగిన వార్ టీజర్ స్పైసీ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. ఖచ్చితంగా ‘వార్’ చూడటానికే బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఓపినింగ్స్ బాగుంటాయి.