బోల్డ్ పాత్ర కోసం ఈషా రెబ్బా.. ?

 
తెలుగు సినిమాల్లో  తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని నానుడి ఉంది.  అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆడపాదడపా ఛాన్స్ లు అందుకంటూ  తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే  స్టార్ హీరోయిన్ గా ఎదిగిన  తెలుగు హీరోయిన్స్  మాత్రం ఎవ్వరూ  కనిపించరు. అందం అభినయం ఉన్నప్పటికీ  స్టార్ హీరోయిన్ గా  ఎదగలేకపోయినవారి లిస్ట్  పెద్దదే ఉంది. అయితే  ఈషా రెబ్బా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
 

సోషల్ మీడియాలో ఈ మధ్య ఈషా రెబ్బా హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఆ  స్టిల్స్  సోషల్ మీడియాలో బాగా  వైరల్ అవుతున్నాయి కూడా.  అయితే ఈ తెలుగు బ్యూటీ  ఓ లేటెస్ట్ అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. హిందీలో తెరకెక్కిన లస్ట్‌స్టోరీస్ వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు  సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ.  కాగా ఇప్పుడు ఆ బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోంది. ప్రస్తుతం ఆ పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతుంది.        

దర్శకుడు సంకల్ప్ రెడ్డి  తెలుగులో చేస్తోన్న ఈ రీమేక్‌ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.  మరి ఈషా ఏ రేంక్ హాట్‌గా నటించనుందో గాని  ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్‌నెస్ హద్దులు దాటిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.