ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ది గ్రేట్ పీపుల్ మేడ్ గ్రేట్ థింగ్స్ అన్న‌ట్టు భార‌తీయ తెర‌పై అద్భుతాలు సృష్టించిన వారంతా క‌లిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ అద్భుతాన్ని సృష్టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ దేశాల‌న్నీ ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలంటే సోష‌ల్ డిస్టెన్సీ. దీన్ని పాటించాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని భావించిన మ‌న ప్ర‌ధాని మోదీ 21 రోజుల పాటు యావ‌త్ దేశం మోత్తం లాక్ డౌన్ ప్ర‌క‌టించారు.

దీంతో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అంతా ఇంట్లోనే వుండాల‌నీ, ఇంటికే ప‌రిమితం కావాల‌ని ఈ విష‌యాన్ని తాము పాటిస్తూనే ప్ర‌జ‌లంతా ఇంట్లోనే వుండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ఇందు కోసం త‌మ వంతు బాధ్య‌త‌గా అవేర్‌నెస్ వీడియోల్లో న‌టిస్తున్నారు. వాటిని జ‌నాలతో పంచుకుంటూ క‌రోనా విష‌యంలో ఎలా జాగ‌రుక‌త‌తో వుండాలో స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం తరుపున విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వీడియోతో ఈ ఉద్య‌మాన్ని మొద‌లుపెట్టాడు.

దాన్ని చిరంజీవి కొన‌సాగించి ఓ వీడియో వ‌దిలారు. తాజాగా దేశంలో వున్న అన్ని ప్ర‌ధాన‌ భాష‌ల హీరోలు బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, ర‌ణ్‌బీర్‌క‌నూర్‌, దిల్జిత్ దొసాంజే, ప్రియాంక చోప్రా, అలియాభ‌ట్‌, ప్ర‌సేన్‌జిత్‌, శివ‌రాజ్‌కుమార్‌, సొనాలి క‌లిసి న‌టించిన `ఫ్యామిలీ` షార్ట్ ఫిల్మ్ సోమ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు సోనీ టీవీలో ప్ర‌సారం చేశారు. సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ వీడియోకి 80కె వ్యూస్‌, 2.8కె రీట్వీట్స్‌, 6.7కె లైకులు వ‌చ్చాయి. సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్స్ ఇండియా, క‌ల్యాణ్‌ జువెల్ల‌ర్స్ సంయుక్తంగా ఈ ల‌ఘు చిత్రాన్ని నిర్మించాయి.

ఇందులో కుటుంబ పెద్ద‌గా బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ క‌నిపించారు. మిగ‌తా వారంతా త‌మ్ముళ్లు, కొడుకులు..ఇలా ఓ కుటంబంలో..అంతా ఓ ఇంటిలోనే వున్న ఫీలింగ్‌ని క‌లిగించారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఎలా తీశారు అనే అనుమానం అంద‌రికి క‌ల‌గొచ్చు. ఎక్క‌డి వారు అక్క‌డే వున్నారు. త‌మ‌కు సంబంధించిన వీడియోని ఒక్కొక్క‌రు ఒక్కో ఏరియా నుంచి ఒక చోటికి చేర్చారు. ఫైన‌ల్‌గా అనుకున్న అద్భుతం ఆవిషృత‌మైంది అదే ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్ అయింది. చివ‌ర్లో అమితాబ్ ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని వెల్ల‌డించారు. ఈ దేశంలో వున్న సినీ కార్మికులంతా ఒక్క‌టే కుటుంబం. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఫిల్మ్ వ‌ర్క‌ర్స్ డైలీ లేడ‌ర్స్ అంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వారంద‌రికీ అండ‌గా వుంటాం. ఎవ్వ‌రు భ‌యాందోళ‌కు గురికావ‌ద్దు. భ‌య‌ప‌డొద్దు. ఈ సంక‌టం త్వ‌ర‌లోనే అంత‌మ‌వుతుంది` అన్నారు అమితాబ్‌.