నాగ్ బాలీవుడ్ రీఎంట్రీ ఈ సినిమాతోనే

బాలీవుడ్ మూవీలో కనిపించనున్నారు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. అయితే బాలీవుడ్ కింగ్ కి కొత్తేమి కాదు. పాతికేళ్ల క్రితం రాంగోపాల్ వర్మ చిత్రీకరించిన శివ మూవీతోనే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కూడా ఖుదా గవా, క్రిమినల్, మేరీ జంగ్ ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. 2003 లో విడుదల అయిన ‘ఎల్ ఓ సి కార్గిల్’ మూవీ తర్వాత ఇప్పటివరకు హిందీ సినిమాల్లో నటించలేదు నాగ్. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ అనే మూవీలో నాగార్జున ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కధనం ప్రచురించింది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

నాగార్జున ఎప్పటి నుండో హిందీ సినిమాలో నటించటానికి ఆసక్తి కనబరుస్తున్నారట. కానీ మంచి ఇంటరెస్టింగ్ స్టోరీ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడట. ‘బ్రహ్మాస్త్ర’ మూవీ స్టోరీ నచ్చడంతో పాటు, తన ఫేవరెట్ యాక్టర్ కం మంచి ఫ్రెండ్ అయిన అమితాబ్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో ప్రాజెక్ట్ సైన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఇక మంగళవారం నుండే నాగ్ హిందీ మూవీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.