టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరెత్తితే వైసీపీ మంత్రి కొడాలి నాని అంతెత్తున లేచి పడతారన్నది తెలిసిందే. ఈ విషయంలో కాస్త దూకుడు తగ్గించుకోమని అధికార పక్షం నేతలు సూచించినా ఆయన మాత్రం స్పీడ్ తగ్గించలేదు. ఇక అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని…ఈ సంగతి జగన్ మోహన్ రెడ్డితో చెబుతాను అన్న దగ్గర నుంచి అమరావతిలో..టీడీపీ లో ఎలాంటి వాతావరణం అలుముకుందో తెలిసిందే. మంత్రిపై అంతా మూకుమ్మడిగా దాడి ప్రారంభించి విమర్శిస్తున్నారు. నేడు అమరావతి మహళలైతే ఏకంగా చీపుర్లే ఎత్తారు. శాసన రాజధానిని వద్దనడానికి నువ్వెవరంటూ ప్రతి దాడికి దిగారు.
మంత్రి పదవి నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్లు వక్తం చేసారు. 267 రోజులుగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులు ఒక్కసారిగా మంత్రిపై భగ్గుమన్నారు. మంత్రి ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యల్ని మంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. గుడివాడ పర్యటనలో ఉన్న మంత్రి కొడాలి నాని చెవిన ఈ విషయం పడిందో ఏమో గానీ! నాని తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబాన్ని ఇప్పటికే కాదు..ఎప్పటికీ తిడుతూనే ఉంటానని..అందులో తనను ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించారు.
అసలే కొలిమిలో నిప్పులా రగిలిపోతున్న అమరావతి రైతులు..టీడీపీ నేతల మంత్రి తాజా కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో. పేదలకు ఇళ్ల పట్టాల పంపీణి విషయంలో టీడీపీ నేతలు అడ్డు పడుతున్నారని…వాళ్ల కారణంగానే పట్టాల కార్యక్రమం వాయిదా పడుతుందని మంత్రి నాని మరోసారి గుడివాడ పర్యటనలో ఆరోపించారు. పేదలకు మంచి చేస్తుంటే..వాళ్ల జీవితాలు ఇంకా అంథ కారంతో నింపేయాలని టీడీపీ కంకణం కట్టుకుందని…ఇక ఆ పార్టీకీ రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.