ఏం పాపం చేశాడు తారక్.. చంద్రబాబు, లోకేశ్ లకు ఇంత పగ ఎందుకో?

నందమూరి హీరోలలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు అందరూ నిస్సందేహంగా తారక్ పేరు సమాధానంగా చెబుతారు. తారక్ ఏ సీన్ లో నటించినా ఎవరూ విమర్శలు చేయలేనంత అద్భుతంగా నటిస్తారనే సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో కూడా ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆ ఇబ్బందులను మనస్సులో దాచుకుంటాడే తప్ప బహిరంగంగా చెప్పడానికి తారక్ ఇష్టపడరు.

అలాంటి హీరోపై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో శాసించగల సత్తా ఉన్న అతికొద్ది మంది నటులలో తారక్ ఒకరని చెప్పవచ్చు. చంద్రబాబు, లోకేశ్ డైరెక్ట్ గా తారక్ పై విమర్శలు చేయకపోయినా తారక్ పై నెగిటివ్ గా ఎంత ప్రచారం జరగాలో అంత ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ లకు తారక్ పై ఇంత పగ ఎందుకో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏం పాపం చేశాడు తారక్ అంటూ రాజకీయ విశ్లేషకుల నుంచి సైతం ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు, లోకేశ్ తన పొలిటికల్ కెరీర్ బాగుండాలనే ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ గా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ ను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేయడం ఏ పార్టీకి మంచిది కాదు.

తారక్ రివర్స్ లో కౌంటర్లు ఇస్తే జవాబు చెప్పడం ఎవరి తరం కాదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను విమర్శించే టీడీపీ నేతలు ఈ విషయాలను గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. తారక్ రేంజ్ వేరే లెవెల్ అని తారక్ గురించి కామెంట్లు చేసేవాళ్లు తమ తప్పులను మొదట గుర్తు చేసుకుంటే మంచిదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తారక్ తనపై వచ్చిన విమర్శల గురించి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.