చంద్రబాబుకు ‘క్షార సూత్ర’ అవసరమా ?

చంద్రబాబునాయుడుకు క్షార సూత్ర చాలా అవసరమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ముందు అవకాశం ఇవ్వాలని  చంద్రబాబు హాడావుడి చేస్తున్నారు. ఇటువంటి సలహానే సోనియా గాంధికి చంద్రబాబు సూచించారని విజయసాయి ఎద్దేవా చేశారు.

సోనియాకు చంద్రబాబు  త్రిసూత్ర వ్యూహాన్ని వివరించారని కులమీడియా పారవస్యంతో రాసిందంటూ రాజ్యసభ సభ్యుడు వ్యంగ్యంగా చెప్పారు. అవే విషయాన్ని ట్విట్లర్లో మాట్లాడుతూ సోనియాకు ఇచ్చిన త్రిసూత్ర సంగతేమిటో కానీ ముందుగా చంద్రబాబుకు క్షారసూత్ర చికిత్స మాత్రం వెంటనే చేయించాలని సూచించారు.

ఆయుర్వేధ వైద్యంలో క్షారసూత్ర అనే వైద్య ప్రక్రియ ఉందని దాన్ని అర్జంటుగా చంద్రబాబుకు చేయించాలని ట్విట్టర్లో చెప్పటం గమనార్హం. చంద్రబాబుకు క్షారసూత్ర వైద్యం అవసరమని చెప్పిన విజయసాయి ఆ వైద్య ప్రక్రియ ఎవరికి ? ఎందుకు వాడుతారన్న విషయాన్ని మాత్రం వివరించకపోవటం గమనార్హం.

ఈమధ్య విజయసాయి ట్విట్టర్లో చంద్రబాబు అండ్ కోపై ప్రతీ రోజు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రతీ మాటను, ప్రతీ సమావేశాన్ని చివరకు నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు అంశాలపైన కూడా తనదైన శైలిలో ట్విట్టర్లో ఘాటుగా స్పందిస్తున్న విషయాన్ని అందరూ గమనిస్తున్నదే.