త్వరలోనే మరో కొత్త నాణెం రాబోతుంది. త్వరలో రూ.20 నాణెన్ని విడుదల చేయనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రూ.20 నాణెంలో రెండు రింగ్స్ ఉంటాయి. వెలుపలి రింగ్ కు 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటాయి. లోపలి రింగ్ కు 75 శాతం రాగి, 20 శాతం జింక్ 5 శాతం నికెల్ తో రూపొందిస్తున్నట్టు తెలిపింది. రూ.10 నాణెంలా కాకుండా కొత్తగా తీసుకు వస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని ఆర్థిక శాఖ ప్రకటించింది.