ప్రతి ఒక్కరు 5గురు పిల్లల్నైనా కనండి ప్లీజ్…

ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రత్యేక హోదా గొడవ జరుగుతూ ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం మర్చిపోయారు. అదేమింటే  పిల్లల్ని ఎక్కువ మందిని  కనండని ప్రతి మీటింగులో సలహా ఇవ్వడం.  ఆమధ్య జపాన్ వెళ్లి అక్కడి ప్రధాని అబే తో మాట్లాడి వచ్చినప్పటినుంచిఆయనకు జనాభా గురించి బెంగ ఎక్కువయింది. జపాన్ లో యువకులు పెళ్లి చేసుకోవడమే లేటు,దానికి పిల్లలను కనడం లేదని, పలితంగా జపాన్ జనం లేని సంక్షోభం లోపడిపోతూ ఉందని జపాన్ ప్రధాని తనతో చెప్పినట్లు ఆయన చెబుతూ వచ్చారు.

పిల్లలను కనడం బర్డన్ అనుకోవద్దని, పిల్లలను కనడం మానేస్తే మనం ఒక రోబోల మీద ఆధారపడాల్సిన దర్గతి వస్తుందని, ఈ సంపద సృష్టి మొతం అనుభవించాలంటే పిల్లలుకనలాని, ఇక కనండని పిలుపు నిచ్చారు. ఈ విషయంలో ఆయనకు బిజెపికి చాలా పోలికలున్నాయి. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేందర్‌ సింగ్‌ కూడా చంద్రబాబులాగా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. పిల్లల్ని కనేసేయండి, కనీసం ప్రతిజంటకు అయిదారుగురయినా ఉండాల్సిందేనని అంటున్నారు.

‘పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం.  ప్రతి హిందువూ కనీసం  ఐదుగురు పిల్లల్ని కనితీరాలి.  హిందూ జనాభాను పెంచి దేశంలో హిందుత్వాని కాపాడాలి,’ అని సురేందర్ సింగ్ ప్రకటించి సంచలనం సృష్టించారు.

అయిదుగురుపిల్లల్నే కనాలని సురేందర్ సింగ్ అనడంలో లాజిక్ కూడా ఉందండోయ్.

అయిదుగిరిలో ఇద్దరు పిల్లలు తండ్రికోసం, మరొక ఇద్దరు పిల్లలు తల్లికోసం ఉండాలి.  మిగిలిన అయిదో బిడ్డ  దేశం కోసం, అని ఆయన వివరణ కూడా ఇచ్చారు.

బలియాలో బుధవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంతాన సందేశం ఇచ్చారు.ఇక కనండని ఎంకరేజ్ చేశారు.

భారతదేశం జాతీయజనాభా నియంత్రణ పాలసీని కఠినంగా అమలుచేస్తున్నపుడు వీళ్లిలా మాట్లాడటం వింతగా ఉంది.