థ్యాంక్యూ లోకేష్… వైకాపా మాట!

ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్న చినబాబు… చెవిరెడ్డి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న ఒక సమస్యకు.. తనదైన రాజకీయ చాణక్యంతో పరిష్కారం చూపించారంట. అందుకే వైకాపా కార్యకర్తలు, చెవిరెడ్డి అభిమానులు, లోకేష్ ను తెగ పొగిడేస్తున్నారంట.

వివారాల్లోకి వెళ్తే… యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటిస్తున్న లోకేష్.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో 400 కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగించిన లోకేష్… చెవిరెడ్డిపైనా, ఆయన అనుచ‌రుల‌పైనా తనదైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం… చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులివ‌ర్తి నాని పేరును ప్రకటించారు. అంటే… ఈసారి కూడా చెవిరెడ్డి ప్రత్యర్థి… పులపర్తి నానినే అన్నమాట! దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారంట చెవిరెడ్డి ఫ్యాన్స్!

ఎందుకంటే… గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో చెవిరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు నాని! నానీపై చెవిరెడ్డి నలభై వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఇదే క్రమంలో… నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం చెవిరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ కి, చెవిరెడ్డి మార్క్ రాజకీయాలకీ, పులపర్తి నానీ ఏమాత్రం సరీన జోడీ కాదనేది స్థానికంగా వినిపించే మాట.

దీంతో… ఈసారి చెవిరెడ్డికి చంద్రగిరిలో చెక్ పెట్టాలంటే.. ఈ ద‌ఫా చంద్రగిరి లో గ‌ల్లా కుటుంబ స‌భ్యులతో పోటీ చేయించాలని తమ్ముళ్లు కోరుకున్నారంట. మాజీ మంత్రి గ‌ల్లా అరుణ.. లేదా, ఆమె కుమారుడు గల్లా జ‌య‌దేవ్‌.. లేదా, కుమార్తె ర‌మాదేవిల‌లో ఎవ‌రో ఒక‌రు పోటీ చేస్తే బాగుంటుందని, రాజకీయం రసవత్తరంగా ఉంటుందని ఆశించారంట! కార్యకర్తలు ఒకటి తలిస్తే.. చినబాబు మరొకటి తలచారు! అయితే… ఉన్నఫలంగా పులపర్తి నానీ ని ఫైనల్ చేసి పేరు ప్రకటించేసాఉ!

దీంతో పండగ చేసుకుంటున్నారంట చెవిరెడ్డి ఫ్యాన్స్. ఫలితంగా… “చెవిరెడ్డిని తిడితే తిట్టావు కానీ లోకేషా.. పాదయాత్ర పేరుచెప్పి మంచి గిఫ్టే ఇచ్చావయ్యా” అంటూ సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెబుతున్నారట!