చంద్రబాబు తనుయుడేనని నారా లోకేష్‌కి ఫోరెన్సిక్ టెస్ట్ చేయించాలా.?

ఆమె ఓ మహిళ. వైసీపీ కార్యకర్త కూడా. పేరు అనితా రెడ్డి. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వుండే మహిళా కార్యకర్తల్లో ఆమె కూడా ఒకరు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదంలో బాధితురాలు ఆమె.

ప్రచారంలో వున్న వీడియోలో, అనితా రెడ్డి ఫొటో కనిపిస్తోంది. ఇదే విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘అది ఒరిజినల్ కాదు, మొబైల్‌లో ప్లే అవుతున్న వీడియోని వేరే ఫోన్‌లో చిత్రీకరించారు..’ అని పోలీసులు ఇప్పటికే తేల్చారు.

ఒరిజినల్ వీడియో మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. అది లభ్యమైతే తప్ప, ఫోరెన్సిక్‌కి విషయం వెళ్ళే అవకాశం లేదు. సో, ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్‌కి క్లీన్ చిట్ రాలేదు. కానీ, ఆయన మాత్రం తనకు క్లీన్ చిట్ వచ్చినట్లుగా చెప్పుకుంటుననారు. సరే, అది వేరే చర్చ. ఈ వివాదంలోకి అనితా రెడ్డిని ఎందుకు లాగారు.?

ఏమోగానీ, అలా తనను లాగడంతో చాలా బాధపడ్డ అనితా రెడ్డి, పోలీసులకు పిర్యాదు చేశారు. అంత బాధ అనుభవించిన ఆమె, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో ఎందుకంత చీప్ ట్వీట్ వేసినట్లు. ‘నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తనయుడేనని కూడా టెస్ట్ చేయించి వుండాల్సింది..’ అని ట్వీటేసింది అనితా రెడ్డి.

దీనీకి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కూడా ఫోరెన్సిక్ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేయాలేమో.. అని టీడీపీ మద్దతుదారులు ట్వీట్లేస్తున్నారు, ఆమెను ట్యాగ్ చేస్తూ. రాజకీయాల్లో అత్యంత అభ్యంతరకరమైన వ్యవహారమిది. సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేస్తాం.. అనే స్థాయికి వ్యవహారం దిగజారిపోయింది. రాజకీయ పార్టీలు ప్రోత్సహించకుండా, ఇలాంటోళ్ళు చెలరేగిపోయే అవకాశం లేదు.