జూనియర్ ఎన్టీఆర్ ను తిడితే తెలుగుదేశం పార్టీకి లాభమా.. వాస్తవాలివే?

చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయనే ప్రశ్నకు సమాధానం చెప్పడం సులువు కాదనే సంగతి తెలిసిందే. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు సీఎం కావడం ఖాయమని అదే జరిగితే నష్టపోయేది లోకేశ్ అని చంద్రబాబు అనుకుంటున్నారు. తాత పార్టీ మనవడి చేతిలోకి వెళితే టీడీపీ మళ్లీ నారా కుటుంబం చేతుల్లోకి రావడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే చంద్రబాబు, బాలయ్య, లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి డైరెక్ట్ గా విమర్శలు చేస్తే టీడీపీకి నష్టమనే సంగతి వాళ్లకు కూడా బాగా తెలుసు. ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ గా టీడీపీ నేతలు తిట్టకుండా ఎవరికీ పరిచయం లేని వాళ్లతో పేరు ఊరు లేనివాళ్లతో తిట్టిస్తున్నారు. ఇలా ఎవరు తిట్టిస్తున్నారో ఎందుకు తిట్టిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదనే సంగతి తెలిసిందే.

తారక్ ను తిట్టించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇప్పటికే చంద్రబాబుపై కోపంగా ఉంది. తారక్ రేంజ్ తో పోల్చి చూస్తే ప్రస్తుతం చంద్రబాబు, బాలయ్య రేంజ్ తక్కువని తారక్ ను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు. తారక్ ను కావాలని తిట్టడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ నేతలు సైతం తారక్ ను సపోర్ట్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ తారక్ ను వాడుకొని వదిలేయడం గురించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తారక్ సపోర్ట్ లేకపోతే ఎప్పటికైనా టీడీపీకి నష్టమే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ అండ లేకపోతే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పరిస్థితి దారుణంగానే ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.