ఆ పని చేయొద్దని పవన్ కాళ్లు పట్టుకుంటున్న టీడీపీ.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర జరుగుతుండగా ఈ పాదయాత్రకు ప్రజల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో లోకేశ్ కు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఆయన గెలవాలని లోకేశ్ టీడీపీని గెలిపించగలరని ఎవరూ భావించడం లేదు. పవన్ వారాహి వాహనంతో యాత్ర మొదలుపెట్టొద్దని టీడీపీ వేడుకుంటోందని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ లో పదో వంతు కూడా లోకేశ్ పాదయాత్రకు రెస్పాన్స్ రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీడీపీ పరిస్థితి ఇప్పటికే ఘోరం కాగా లోకేశ్ పాదయాత్రతో పార్టీ పరిస్థితి మరింత దారుణం అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

పవన్ వారాహి యాత్రను మొదలుపెడితే పవన్ యాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన సభలకు రికార్డ్ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. పవన్ సభలకు వచ్చే స్థాయిలో లోకేశ్ పాదయాత్రకు రెస్పాన్స్ వచ్చే అవకాశం లేదు. ఈ రీజన్ల వల్లే చంద్రబాబు టెన్షన్ పడుతుండగా పవన్ యాత్ర ఆయనను మరింత టెన్షన్ పెడుతోంది.

పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే మాత్రం ఆయన కచ్చితంగా సీఎం అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.