మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారట.. అంటూ కొన్ని పోస్టర్లు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ పోస్టర్ల వెనుక రాజకీయం ఎవరిది.?
వైసీపీనే ఈ పోస్టర్లు సృష్టించిందన్నది టీడీపీ ఆరోపణ. అసలు వైసీపీ ఎందుకలా చేస్తుంది.? వైసీపీకి ఏంటి ఆ అవసరం.? ఆ పోస్టర్లు తొలుత ప్రచారంలోకి తెచ్చింది వైసీపీనే. వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ పోస్టర్లను ప్రస్తావిస్తూ, విమర్శలు సంధించడం కనిపించింది.
వైసీపీ మద్దతుదారులు ఈ పోస్టర్లను వైరల్ చేశారు కూడా.! ఈ పోస్టర్లను ఎవరు తయారు చేయించారు.? ఎవరు వీటిని అంటించారు.? అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అధికారంలో వున్న పార్టీకి. తాము చేసిన ప్రచారం తమ పార్టీకి నెగెటివ్‌గా మారుతుందని గుర్తించలేకపోతోంది వైసీపీ.
ఈ తరహా వ్యూహాలు రచించి, అమలు చేయడంలో టీడీపీ తక్కువేమీ కాదు. సునీతా రెడ్డిని టీడీపీలోకి లాగితే, వైసీపీని మరింతగా లాక్ చేయొచ్చన్నది టీడీపీ వ్యూహం అయినా అయి వుండొచ్చు.
‘టీడీపీలోకి సునీతా రెడ్డి..’ అని వైసీపీ ఆరోపిస్తోంటే, ‘వైసీపీలోకి షమీమ్ (వైఎస్ వివేకా రెండో భార్య) అంటూ టీడీపీ కొత్త ప్రచారానికి తెరలేపింది.