టీడీపీ అధినేత చంద్రబాబు సిత్రాలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో విజనరీ పేరుతో నిప్పు బాబు చేసిన దిక్కుమాలిన పనులు దేశ వ్యాప్తంగా చర్చించేలా చేస్తుంది సోషల్ మీడియా. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి భూకుంభకోణం వ్యవహారం పై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవస్థలను మ్యానేజ్ చేసేందుకు, చంద్రబాబు ఏ విధంగా, ఎంతలా దిగజారారో సోషల్ మీడియా బయటపెడుతోంది.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిదే. ముఖ్యంగా ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన టైమ్‌లో, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అమరావతి రాజధానిలో ఏకంగా 13 మంది హైకోర్టు జడ్జీలకు వ్యక్తిగతంగా, తలా 600 గజాల చొప్పున భూములను చాలా ఛీప్‌గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు, ఇలా చేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వలుకి పూర్తి విరుద్ధం అనే విషయం విజనరీ బాబుకు తెలియంది కాదు. అంతే కాకుండా న్యాయమూర్తులు వ్యక్తిగతంగా, ప్రభుత్వం వద్ద నుండి ఎలాంటి లబ్ది పొందకూడదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నుండి లబ్ధి పొందిన జడ్జీలు అమరావతి లాండ్‌స్కామ్ గురించి తీర్పులు ఇవ్వడం గమనార్హం.
ఇక ఇటీవల ప్రతి కేసులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో న్యాయ వ్యవస్థలో వ్యక్తిగతంగా లబ్ధిపొందిన వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు రుణం తీర్చుకుంటూ ఓటమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే హైకోర్టు తీరుపై ప్రభుత్వం సహనంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో చర్చజరుగుతోంది. పాయింట్ టు పాయింట్ తెరపైకి తెచ్చి మరీ చంద్రబాబు అండ్ 13 మంది హైకోర్టు జడ్జీల వ్యవహారం పై కేంద్ర, సుప్రీం కోర్టు జ్యోక్యం చేసుకోవాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారంలో చివరిగా ఏం జరుగుతుందో చూడాలి.