నల్లగొండ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డికి ఊహించని సంఘటన ఎదురైంది. టిఆర్ఎస్ మీద, కేసిఆర్ పాలన మీద నిప్పులు చెరిగే కోమటిరెడ్డికి ఒక టిఆర్ఎస్ కార్యకర్త గులాబీ కాండువా కప్పబోయారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం నియోజకవర్గ కేంద్రంలో పాత బస్తీలో పర్యటిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇది కొద్దిసేపట్లో నల్లగొండ పట్టణంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు, వీడియో చూడండి.
నల్లగొండ పట్టణంలోని చౌరస్తాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక టిఆర్ఎస్ కార్యకర్త తన జేబులో ఉన్న టిఆర్ఎస్ కండువా కప్పేందుకు ప్రయత్నించారు. దీంతో కోమటిరెడ్డి హైబత్ అయ్యారు.
వెంటనే తేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కండువా కప్పకుండా అడ్డుున్నాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. తర్వాత అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లిపోయారు.
కండువా కప్పిన వ్యక్తి టిఆర్ఎస్ నాయకుడు అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ ఘటన నల్లగొండ పాత బస్తీలోని 36వ వార్డులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో కింద ఉంది.