ఏపీ లో రెండవ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగుదశల్లో జరగనున్న పంచాయితీ పోరులో ఇప్పటికే తొలిదశ ముగిసింది. రెండవ దశలో 2 వవేల 786 పంచాయితీలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీ పంచాయితీ పోరులో రెండో అంకం పూర్తి కావస్తోంది. రెండవ దశ పోలింగ్ ఇవాళ ప్రారంభమంది. రాష్ట్రంలో రెండవ దశలో 3 వేల 328 పంచాయితీ గ్రామ పంచాయితీలకు నోటిఫికేషన్ వెలువడగా..539 పంచాయితీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 2 వేల 786 పంచాయితీలకు పోలింగ్ ఇవాళ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. మద్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి స్థానాలకు 7 వేల 507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33 వేల 570 వార్డులుండగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. దాంతో 20 వేల 817 వార్డులకు 44 వేల 876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
రెండవ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. సమస్యాత్మక పోలింగ స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి మండలానికో డీఎస్పీని నియమించి పర్యవేక్షిస్తున్నారు. తొలిదశ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో అదే విధంగా పోలింగ్ శాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండు కంట్రోల్ సెంటర్ నుంచి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగును కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలిస్తున్నారు.