RGV: చంద్రబాబుపై నాకున్న ఒపీనియన్ ఎప్పటికీ మారదు.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

RGV: రాంగోపాల్ వర్మ ఇటు రాజకీయాల పరంగా అటు సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనగా మారారు. ఈయన గతంలో వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడమే కాకుండా కూటమి నేతల గురించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే వర్మ అరెస్టుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయని ఈయన పరారీలో ఉన్నారంటూ పోలీసులు తెలియజేయడంతో వర్మ స్పందించారు. తానేమి పరారీలో లేనని సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపారు.

తాను చట్టానికి ఎంతో గౌరవం ఇస్తానో కానీ మీడియా నుంచి అధికంగా ఫోన్ కాల్స్ రావడం వల్ల నేను ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను అని తెలిపారు .ఇలా వర్మ గురించి రోజుకు ఒక వార్త వెలుగులోకి రావడంతో ఈయన మాత్రం తగ్గేదిలే అనే విధంగా తరచూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను అలాగే పోస్టులను చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి జైలు వద్ద సెల్ఫీ దిగిన విషయం కూడా ప్రస్తుతం వివాదంగా మారింది.

ఇక ఈ విషయం గురించి రాంగోపాల్ వర్మ వివరణ ఇస్తూ నేను అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకున్న మాట నిజమే కానీ ఆ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు జగన్ ఉన్న గాంధీజీ గారు నా నేను సెల్ఫీ తీసుకునే వాడిని అంటూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి ఈయన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎలాంటి సదాభిప్రాయం లేదని తెలిపారు. ఆయన ఎప్పుడైతే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి చంపేశారు అప్పుడు ఆయనపై ఏర్పడినటువంటి అభిప్రాయం ఇప్పటికే అలాగే కొనసాగుతుంది తప్ప తనపై ఎప్పుడూ కూడా నాకు మంచి అభిప్రాయం ఏర్పడదని రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తనని అరెస్టు చేసి జైలుకు పంపిన తానేమి భయపడను, జైలుకు వెళ్లిన హ్యాపీగా కథలు రాసుకుంటానని వర్మ తెలిపారు.