కొడంగల్ కార్యకర్తలతో రేవంత్ ఏమన్నారో చూడండి (వీడియో)

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొడంగల్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన గెలుపు పై తనకు నమ్మకముందని కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి యువకుడు మరో రేవంత్ రెడ్డయ్యి ప్రచారం చేయాలన్నారు. తను నూరు గ్రామాలు తిరిగి ప్రచారం చేయాలా లేక నూరు నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేయాల అనేది మీరు చెప్పాల్సిన అవసరముందని కార్యకర్తలతో అన్నారు. తాను కూడా ప్రతి గ్రామంలో తిరిగితే పట్నం నరేందర్ రెడ్డికి తనకు తేడా లేదన్నారు.

తాను సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ప్రచారం చేస్తానన్నారు. రాష్ట్రమంతా పర్యటించాల్సిన అవసరం ఉన్నందున మీరే భుజస్కందాలపై వేసుకొని ప్రచారం చేయాలన్నారు. తాను చేసే శ్రమ కొడంగల్ ప్రజల అభిమానాన్ని పెంచుతుందన్నారు. 

60 ఏళ్ళ కాలంలో ఉమ్మడి మహబూబ్  నగర్  జిల్లాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానం లేదని అటువంటిది రాహుల్ గాంధీ గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానం తనకు కల్పించారన్నారు. రాబోయే 50 రోజులు మీరు తన కోసం పని చేస్తే స్థానిక సంస్థల సమయాన మీ కోసం నేను పనిచేస్తానని కార్యకర్తలతో అన్నారు. కష్టపడి పనిచేసే నాయకులకు రాబోయే స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటిసి, జడ్పీటిసి పదవులలో ప్రాధాన్యత ఇస్తానని రేవంత్ వారికి ఆఫర్ ఇచ్చారు. రాహుల్  గాంధీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఈ దొర కేసీఆర్ చేసిన అక్రమాలను ప్రజలందరికి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. టిఆర్ ఎస్ పార్టీ వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పట్నం నరేందర్  రెడ్డి అసలు పోటినే కాదన్నారు. గాయన మీద కూడా తాను ఎన్నికల ప్రచారానికి తిరిగితే తనను తాను కింద పడేసుకున్నట్టే అని అందుకే మీరే నన్ను గెలిపించాలన్నారు. ప్రతి ఊరిలోని యువకుడు ఒక రేవంత్  రెడ్డి అయ్యి ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ముందుండి ప్రత్యర్దుల ఎత్తులను చిత్తులు చేయాలన్నారు. వారెన్ని కుట్రలు పన్నినా కొడంగల్  లో కాంగ్రెస్  గెలుపు ఖాయమన్నారు. మీరంతా తనకు అండగా ఉండాలని రేవంత్ కార్యకర్తలను కోరారు.   రేవంత్ కొడంగల్ ప్రజలతో మాట్లాడిన వీడియో కింద ఉండి చూడండి.   

 

revanth reddy meet congress