రేవంత్ దెబ్బతో జుట్లు జుట్లు పట్టుకుంటున్నారు

రేవంత్ ఫిర్యాదుతో ఐటి శాఖాధికారులు, పోలీసులు జుట్లు పట్టుకుంటున్నారు. ఐటి అధికారులమని చెప్పి ఉదయ్ సింహా బంధువు రణధీర్ రెడ్డి ని అదుపులోకి తీసుకొని 24 గంటల పాటు నిర్బంధించడం పై ఐటి శాఖాదికారులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి అధికారులు తాము అలా చేయలేదని పోలీసులు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారిస్తామన్నారు.

రేవంత్ ఫిర్యాదుతో స్పందించిన ఐటి శాఖ కమీషనర్ … హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ టాస్క్ ఫోర్స్ డిసిపీ రాధాకిషన్ రావులతో మాట్లాడినట్టు తెలిసింది. దీంతో కమీషనర్ ఈ విషయం తన దృష్టిలో లేదని తెలుసుకుంటానన్నారు. పోలీసుల పనితో ఐటి శాఖ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంజనీకుమార్ ను ఐటి కమిషనర్ గట్టిగానే అడిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం పై హోం శాఖ అధికారులు, పోలీసు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోని చెబుతానని రేవంత్ కు ఐటి అధికారులు తెలిపారు.

అసలు పోలీసులు రణధీర్ ను ఐటి అధికారులమని చెప్పి ఎందుకు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎవరు అదుపులోకి తీసుకోమన్నారనే విషయం పై క్లారిటి లేదు. దీంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని ఒకలి జుట్టు ఒకలు పిక్కునే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతోంది. పోలీసులు ఐటి పేరు చెప్పుకుని దొంగచాటుగా దాడులు చేయడమేంటని రేవంత్ ఇష్యూ చేయడంతో రెండు శాఖల వారు ఇరకాటంలో పడ్డారు. పోలీసులు సొంతంగానే దాడులు చేశారా లేక పై నుండి ఆదేశాల మేరకు దాడులు చేశారా అనేది తేలాల్సి ఉంది.  తమ పేరు చెప్పి దాడులు చేయడాన్ని మాత్రం ఐటి శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఉదయ్ సింహాకు బంధువు రణధీర్ రెడ్డి. రణధీర్ రెడ్డి ఇంటికి ఐటి అధికారులుగా వచ్చిన పోలీసులు ఇళ్లంతా సోదా చేసి పలు పత్రాలతో పాటు, ఇంట్లో ఉన్న హర్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు. అలాగే రణధీర్ ను 24 గంటలపాటు తమ ఆధీనంలో ఉంచుకొని ఆ తర్వాత ఉప్పల్ వాహనాల తనీఖీలలో దొరికాడని వదిలి వెళ్లారు. ఇదంతా వ్యవహారం చూస్తుంటే కావాలనే చేసినట్టుందని పలువురు అంటున్నారు. మరీ రేవంత్ ఫిర్యాదు పై ఐటి, పోలీసులు ఏ విధంగా స్పందించనున్నారోనని అంతా ఎదురు చూస్తున్నారు.