నారా లోకేష్ ని చంద్రబాబు కనాలనుకోలేదు… వర్మ వీడియో వైరల్!

యువగళం పాదయాత్రలో భాగంగా మైకులముందుకు వచ్చిన నారా లోకేష్… విజయవాడలో రాం గోపాల్ వర్మ సినిమాకు అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్జీవీపై మరి కొన్ని విమర్శలు చేశారు. దీంతో తాజాగా తనదైన శైలిలో ఒక వీడియో వదిలారు ఆర్జీవి!

తన తండ్రి చిన్న ఉద్యోగి అని, తాను కష్టపడి సినీరంగంలోకి వచ్చి స్థిరపడ్డానని ఆర్జీవీ చెప్పుకున్నారు. లోకేష్ కి చంద్రబాబు కుమారుడిగా తప్ప మరో ఐడెంటిటీ ఏమిటో చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా తన విజయాలు, నారా లోకేష్ విజయాలు పక్క పక్కనపెట్టి చూస్తామన్నారు.

ఇదే క్రమంలో తనను థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన వర్మ… లోకేష్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. “చంద్రబాబు నారా లోకేష్ ని కనాలనుకోలేదు.. కానీ చంద్రబాబుకి లోకేష్ పుట్టారు.. అదొక బయలాజికల్ యాక్సిడెంట్ మినహా ఇంకేమీ కాదు” అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు!

ఇదే సమయంలో… నారా లోకేష్ తెలియని అభద్రతా భావంలో ఉన్నారని ఎద్దేవా చేసిన వర్మ.. పవన్ సభలకు జనం వస్తున్నారని, తన సభలకు రాలేదనే భయంలో ఉన్నారని.. దీంతో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని తెలిపారు. ఆయన మానసిక పరిస్థితి అర్ధం చేసుకోదగినదే అన్నట్లుగా వర్మ స్పందించారు.

తన సినిమాతోపాటు రోజూ వివిధ ప్రాంతాల్లో వివిధ సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయని.. సినిమా షూటింగ్ లకు, రాజకీయ సభలకు ఇచ్చే పర్మిషన్లను ఒకేగాటన ఎలా కడతారంటూ వర్మ ప్రశ్నించారు. షూటింగ్‌ పర్మిషన్‌ కు, మీటింగ్‌ పర్మిషన్‌ కు మధ్య సంబంధమేంటని ఆయన సూటిగా అడిగారు.

ప్రతీ ఒక్కరికీ ఒక వ్యూహం ఉంటుందని.. అలా ఓ వ్యూహం ప్రకారం రాజకీయ లబ్ధికోసం నారా లోకేష్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పులేదని వర్మ తెలిపారు. ఆయన ఆ అజెండాతో కాకుండా.. అదే నిజమనే భ్రమలో మాట్లాడితే మాత్రం అర్జంట్ గా ఆయన సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాగా… ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీస్తున్న “వ్యూహం” సినిమా షూటింగ్ ప్రకాశం బ్యారేజ్ పై జరిగిన సంగతి తెలిసిందే. వర్మ సినిమాకు పర్మిషన్ ఇస్తారు కానీ, తన పాదయాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. అక్కడితో ప్రశ్నించి ఆగితే పర్లేదు. లోకేష్.. వర్మపై కామెంట్లు చేశారు.

ఆ సమయంలోనే ఆయన ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలు చేసే డైరెక్టర్ అంటూ లోకేష్ సెటైర్లు పేల్చారు. ఆ సెటైర్లకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ పుట్టుక ఓ బయలాజికల్ యాక్సిడెంట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు!

RGV’s LOKESH| RGV | RGV Nijam | Nara Lokesh