ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా.. “ఓరు ఆడారు లవ్” అనే మళయాల సినిమాతో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమాలోని ఆడార్ లవ్ పాటలో ఈ చిన్నది కన్నుకొట్టి సమ్మోహనంగా ముఖం తిప్పుతుంది. కన్ను బొమ్మలను మన్మధ బాణంలా సంధించి హీరో గుండెలో బాణాల్ని దింపేస్తుంది. దెబ్బకు హీరో ఫ్లాట్ . పార్లమెంట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అలాంటి చిలిపి చేష్టనే చేశాడు. పార్లమెంటులో రాహుల్ కన్ను కొట్టిన క్లిప్ ఒకటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియా వారియర్ కన్ను కొడితే కోట్లాది మంది భారతీయులు పడిపోయారు. ఇప్పుడు ప్రియా వారియర్ లా రాహుల్ కన్ను కొట్టాడు కాబట్టి మోడీ పడిపోతాడా లేక మోడీ ప్రభుత్వం పడిపోతుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హాట్ మసాలా: అప్పుడు ప్రియా వారియర్, ఇప్పుడు రాహుల్
